పవన్ సినిమాలో మోహన్ లాల్!

పవన్ కల్యాణ్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నాడు. పవన్ ప్రస్తుతం చేస్తోన్న కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్రను కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో చేయించాలని అనుకున్నారు.
కానీ ఆ తరువాత మనసు మార్చుకొని ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ను తీసుకోవాలని భావించారు.

దీనికి కోసం ఇప్పటికే ఆయనను సంప్రదించడం, కథ చెప్పి ఒప్పించడం జరిగిపోయాయని తెలుస్తోంది. జనతా గ్యారేజ్, మనమంతా, మన్యం పులి చిత్రాలతో ఈ మధ్య మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయనకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమా కోసం ఆయనను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 14 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందని సమాచారం.