‘డిజె’ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బద్దలు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ గా కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ ట్రైలర్ విడుదలయ్యి 15 గంటలు దాటుతుండగా దాదాపు మూడు మిలియన్ వ్యూస్ కు దగ్గరగా చేరింది. బ్రాహ్మణుడిగా బన్నీ లుక్, అతడు చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

‘పబ్బుల్లో వాయించే డిజె కాదు.. పగిలిపోయేలా వాయించే డిజె’, ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సర్.. యుద్ధం శరణం గచ్చామి’లాంటి డైలాగ్స్ , పూజా హెగ్డే గ్లామర్ అన్నీ కలిపి ట్రైలర్ ను సూపర్ హిట్ చేసేశాయి. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలు చిత్రబృందం ఏ మేరకు రీచ్ అవుతుందో.. జూన్ 23 వరకు ఆగాల్సిందే!