Homeతెలుగు Newsబాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు

బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అమరావతి బాండ్లు

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అమరావతి బాండ్లను బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం లిస్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ హాజరయ్యారు. జ్యోతి
ప్రజ్వలన అనంతరం 9.15 గంటలకు చంద్రబాబు గంట కొట్టి లిస్టింగ్‌ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్‌డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్‌ ప్లాట్‌ఫామ్‌పై బాండ్లను జారీ చేయగా కేవలం గంట వ్యవధిలోనే మదుపరుల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరిన సంగతి తెలిసిందే. అవే బీఎస్‌ఈలో సోమవారం లిస్టింగ్‌ అయ్యాయి.

11 18

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బీఎస్ఈలో అమరావతి బాండ్లు నమోదు కావడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఒక అద్భుతమైన నగరం లేదని.. ఒక విజన్‌తో ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు సంకల్పించామని, ప్రపంచంలో ఐదో అత్యుత్తమ నగరంగా అమరావతిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. బీఎస్ఈ తరహాలో ఏపీ కూడా ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. 217 చ.కి.మీ. పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద భూసమీకరణ ప్రక్రియ ఏపీలో జరిగిందని, 44 నెలలుగా అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని చంద్రబాబు తెలిపారు.

పాలనలో పెట్టుబడులు ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని బీఎస్‌ఈ సీఈవో, ఎండీ ఆశిష్‌కుమార్‌ అన్నారు. టెక్నాలజీ వినియోగంలోనూ ఏపీ ప్రథమస్థానంలో ఉందని ప్రశంసించారు. అమరావతి నిర్మాణం అద్భుతంగా కొనసాగుతోందని, నగర నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బాండ్లు జారీ చేయడం మంచి ఆలోచన అని ఆశిష్ కుమార్‌ అన్నారు. 1998లో అహ్మదాబాద్‌ నిర్మాణం కోసం మున్సిపల్‌ బాండ్లు జారీ అయ్యాయని తెలిపారు. అమరావతి బాండ్లు ఆగస్టు 14న జారీ కాగా.. గంట వ్యవధిలోనే రూ.2వేల కోట్లు ఆర్జించినట్లు వెల్లడించారు. బీఎస్‌ఈలో 500 కంపెనీలు నమోదయ్యాయని.. 6 మైక్రో సెకన్లలో లావాదేవీలు నిర్వహించుకునేలా బీఎస్‌ఈ ఎదిగిందని ఆశిష్‌కుమార్‌ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu