HomeTelugu Newsబాగ్‌బాస్‌లో విజయ్‌ దేవరకొండ

బాగ్‌బాస్‌లో విజయ్‌ దేవరకొండ

7a 5తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో సెటబ్రెటీలు సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌, ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ.. ఉంటారు. గతంలో ‘వైఫ్‌ ఆఫ్‌ రామ్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా మంచు లక్ష్మి హౌస్‌లోకి ఎంట్రీ చేసిన సందడిని చూశాం. ఆ తరువాత యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌ను ఆశ్చర్యపరిచాడు. ఈ హీరోతో కలిసి ఇంటి సభ్యులు చేసిన హంగామాను ప్రేక్షకులు కూడా ఎంజాయ్‌ చేశారు. తాజాగా విజయ్‌ దేవరకొండ కూడా బిగ్‌బాస్‌లోకి వచ్చాడు.

7 17

‘గీత గోవిందం’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ పరుశురామ్‌తో కలిసి బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి వేదిక దొరికినా తన మాటలతో మాయ చేసే అర్జున్‌ రెడ్డి.. ఇక ఇంటి సభ్యులతో ఎంత హంగామా చేశాడో తెలియాలంటే.. ఈ రోజు (ఆదివారం) షో చూడాల్సిందే. విజయ్‌ ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu