బిగ్‌బాస్‌ లో నాగ్‌ తుపాకీ గురి పెట్టి.. నానిని ఎవరో ఇబ్బంది పెడుతున్నారట..!

తెలుగు ‘బిగ్‌బాస్-2’ రియాలిటీ షోలో ఈ రోజు ఆదివారం స్టార్ హీరోహీరోయిన్‌ల రాకతో కళకళలాడనున్నది. బిగ్‌బాస్ వేదికపైకి దేవదాస్ చిత్రంలో నటించిన నాగార్జున, రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ సందడి చేయనున్నారు. ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియతోపాటు దేవదాస్ ప్రమోషన్ ఉత్సాహంగా సాగనున్నది. ఇంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు స్పష్టంగా కనిపించింది. రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో నాని వెరైటీగా దర్శనిమిచ్చాడు. గణపతిని ఊరేగిస్తూ వేదికపైకి వచ్చారు. బాజాలా మోగిస్తూ గణపతి బొప్ప మోరియా అంటే ఊరేగింపులో పాల్గొన్నారు. చాలా సందడిగా సందడిగా జరిగిపోయినట్టు కనిపించింది.చేతితో తుపాకితో నాగార్జున వేదిక మీద దేవదాస్ సినిమా గురించి ఓ కథ చెబుతూ.. అనగనగా ఓ ఊర్లో డాక్టర్. డాక్టర్ ప్రేమ కథ అంటుండగానే నాగార్జున తుపాకీ పేల్చి వేదికపైకి వచ్చాడు. వేదిక మీద నుంచి సెలబ్రిటీలను ఉద్దేశించి.. మా డాక్టర్‌ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారట అంటూ తుపాకీ చూపించాడు. నాగార్జున మాటల్లో నాని మాట కలుపుతూ.. ఆ తుపాకిలో ఎన్ని తూటాలు ఉన్నాయి అని అడిగాడు. అందుకు ఆరు బుల్లెట్లు ఉన్నాయి అని సమాధానమిచ్చారు. దాంతో ఇంట్లోని ఆరుగు సభ్యులు కంగుతిన్నారు.

నానితోపాటు ఇంటి సభ్యులతో నాగార్జున అలా సరదాగా మాట్లాడుతూ.. ఎప్పటి నుంచి ఉంటున్నారు అని అడుగగా.. 106 రోజులు అని నాని, సభ్యులు సమాధానమిచ్చారు. దాంతో మీకు ఏదైనా పోయే కాలం వచ్చిందా? అని ప్రశ్నించారు. నాగార్జునతో కౌశల్ మాట్లాడుతూ.. దేవదాస్ ట్రైలర్‌లో పెగ్గుల మీద పెగ్గులు ఇచ్చేశారు అని అన్నారు. దానికి సమాధానం ఇస్తూ.. ఇంట్లో పెగ్గు ఇస్తారా అని అడిగితే ఇవ్వరు అని సమాధానం ఇచ్చారు. అంతలోనే మీ హీరోయిన్లు బాగా ఉన్నారు అని కౌశల్ అనగా.. తుపాకీ ఎక్కుపెట్టి మీదకు ఉరికినట్టు చేశాడు. ఇంట్లో అలా అన్ని రోజులు ఉండటం నా వల్ల కాదు. ఒకవేళ ఆరుగురిలో ఐదుగురు అమ్మాయిలు ఉంటే నేను ఉండగలను అని నాగార్జున అన్నారు. అంతలోనే నాని వైపు నాగ్ తిరిగి స్టేజి మీద కలర్స్ లేరేంటి అని అడుగా.. నాకు అదే సమస్యగా మారింది అని గోడు చెప్పుకొన్నాడు. నాని బాధ చూసి నీ కోసం అమ్మాయిలను పంపుతాను అంటూ నాని వెళ్లిపోయాడు. అంతలోనే పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ అంటూ పాట వస్తుండగా నాని వెనుక నుంచి రష్మిక, ఆకాంక్ష సింగ్ వచ్చి షాకిచ్చారు. ఇలా బిగ్‌బాస్ కలర్‌ఫుల్‌గా సాగింది.