HomeTelugu Big Stories'బాహుబలి - బిఫోర్ ది బిగింగ్'

‘బాహుబలి – బిఫోర్ ది బిగింగ్’

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సృష్టించి ‘బాహుబలి’ నుండి ఇప్పటికే ‘ది బిగినింగ్, ది కన్క్లూజన్’ పేరుతో రెండు భాగాలు విడుదలై భారీ విజయాల్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తామన్నా, రానా, రమ్యా కృష్ణ మొదలైన వారు ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ బాహుబలి నుండి మరొక భాగం కూడ రానుంది. అయితే అది సీక్వెల్‌ కాదు ప్రీక్వెల్‌.

7 1

ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.350 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించి వెబ్ సిరీస్ రూపంలో దీన్ని రూపొందిస్తోంది. శివగామి పాత్ర, మాహిష్మతి సామ్రాజ్య వైభవం నేపథ్యంలో ఉండనున్న ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లుగా విడుదలకానుంది. దీనికి సంబందించిన ప్రోమో వీడియోను నెట్ ఫ్లిక్స్ విడుదలచేసింది. ఈ సిరీస్ కు ‘బాహుబలి – బిఫోర్ ది బిగింగ్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. దీన్ని రాజమౌళి పర్యవేక్షణలో దేవ కట్ట డైరెక్ట్ చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu