HomeTelugu Big Storiesఆర్జీవీతో బిగ్‌బాస్‌-4 బ్యూటీ

ఆర్జీవీతో బిగ్‌బాస్‌-4 బ్యూటీ

Bigg Boss fame Ariyana fame

తెలుగు బిగ్‌బాస్‌-4 ఫేమ్‌, బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్వ్యూలతో, మాల్స్‌ ఓపెనింగ్స్‌తో, పార్టీలతో క్షణం తీరిక లేకుండా పోయింది. పనిలో పనిగా ఓ సినిమాకు సంతకం కూడా చేసిన విషయం తెలిసిందే. “సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు” ఫేమ్‌ శ్రీనివాస్‌ గవిరెడ్డి డైరెక్షన్‌లో రాజ్‌ తరుణ్‌తో హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్‌ చేసింది. బిగ్‌బాస్‌కు ముందు అరియానా సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మను ఇంటర్వ్యూ చేసిన వీడియో అప్పట్లో వైరల్‌ అయింది. దీంతో ఆమె బాగా ఫేమస్‌ అయింది. ఈమె బిగ్‌బాస్‌ ఎంట్రీకి కూడా ఓ రకంగా ఆర్జీవీనే కారణం అన్న వార్తలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో వర్మ ఆమెకు ఓటేయమంటూ సోషల్‌ మీడియా వేదికగా మద్దతు తెలపడం విశేషం. అంతే కాదు వీలైతే అరియానాతో సినిమా తీసేందుకు సిద్ధమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా వీళ్లిద్దరూ సమావేశమయ్యారు. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న అరియానా తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మను కలిసింది. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో వర్మ ఆమెతో సినిమా తీస్తానన్న మాట గురించి ప్రస్తావించాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

https://www.instagram.com/p/CK-x0W6Je92/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu