HomeTelugu Newsబిగ్‌బాస్‌కి 'రంగమ్మత్త'

బిగ్‌బాస్‌కి ‘రంగమ్మత్త’

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-2 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టిస్తోంది ఈ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు. కాగా ఈ వారం (సోమవారం) ఎపిసోడ్‌ ఎలిమినేషన్‌ ప్రక్రియ.. ఇంటి సభ్యులపై అభిమానుల నెగటీవ్‌ కామెంట్స్‌.. వాటికి వారి సమాధానంతోనే సాగింది. ఇక ఈ ఎపిసోడ్‌ చివరిలో బిగ్‌బాస్‌ ఇంటిలో పెళ్లి సందడి నెలకొందని హింట్‌ ఇస్తూ.. ఓ ప్రోమోతో బిగ్‌బాస్‌ ప్రేక్షకుల్లో ఆశక్తిని రేకెత్తించారు.

8a 5

అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ హౌస్‌లో సందడి చేస్తోంది. పెళ్లి సందడి టాస్క్‌లో భాగంగా ఆమె సెలబ్రిటీ హోదాలో ముఖ్య అతిథిగా హాజరైనట్లు అర్థమవుతోంది. సూయ..సూయ అనసూయ సాంగ్‌తో బిగ్‌బాస్‌ ఆమెకు ఘనస్వాగతం పలకగా.. ఇంటి సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో అనసూయను రీసివ్‌ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే నేటి ఎపిసోడ్‌లో రంగమ్మత్త అలరించనున్నారు. తుది అంకానికి చేరుకున్న ఈ రియాల్టీ షోకు మరో నాలుగు వారాలే మిగిలిఉంది. కాగా ఆదివారం ఎపిసోడ్‌లో హీరో విజయ్‌ దేవర కొండ చేసిన హాంగామా తెలిసిందే.

8 18

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!