HomeTelugu News'బ్రాండ్ బాబు'పై జర్నలిస్ట్‌ ఫిర్యాదు

‘బ్రాండ్ బాబు’పై జర్నలిస్ట్‌ ఫిర్యాదు

కన్నడ నటుడు సుమంత్‌ శైలేంద్రను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘బ్రాండ్ బాబు’. ఈ చిత్రానికి బుల్లి తెర నటుడు ప్రభాకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మారుతి కథను సమకూర్చారు. కాగా ఈ సినిమా నిన్న (శుక్రవారం) విడుదలైంది. కాగా బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఈ సినిమా పై కేసు నమోదైంది.

1 5

తన ఫోటోను అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించడంపై ఓ మహిళా జర్నలిస్ట్‌ ఫిర్యాదు చేశారు. బ్రాండ్ బాబు సినిమాలో చనిపోయిన సన్నివేశంలో తన ఫోటో చూపారని బాధిత మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ 509 సెక్షన్ కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu