HomeTelugu Newsమహేష్‌ 'సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌' షేర్‌ చేసిన కవిత

మహేష్‌ ‘సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌’ షేర్‌ చేసిన కవిత

టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గతేడాది రక్షా బంధన్‌కు హెల్మెట్‌కు కానుకగా ఇవ్వండి అంటూ ఓ క్యాంపైన్‌ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అది చాలా పాపులర్‌ అయి రాఖీ సందర్భంగా తమ అన్న, తమ్ముళ్లకు హెల్మెట్లను కానుకగా ఇచ్చారు. తాజాగా ఈ క్యాంపైన్‌కు సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు తన వంతు సహాయాన్ని అందించారు. కాగా నేడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా కవిత తన ట్విటర్‌ ఖాతాలో.. మహేష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. సిస్టర్స్‌ ఫర్‌ చేంజ్‌ క్యాంపైన్‌కు బాసటగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. మహేష్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.

9 8

ఈ వీడియోలో మహేష్‌ బాబు.. మన దేశంలో రోజూ జరిగే ప్రమాదాల్లో హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల రోజుకు 28 మంది చనిపోతున్నారని.. అంటే 28 కుటుంబాలు తమకిష్టమైన వ్యక్తిని కోల్పోతున్నాయని ఆవేదన చెందారు. ఈ రాఖీ పండుగకు సిస్టర్స్‌.. తమ అన్నదమ్ముళ్లకు హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ధరించమని చెప్పాలంటూ కోరారు. ఒక ప్రాణాన్ని కాపాడితే ఒక కుటుంబాన్ని కాపాడినట్టే అని మహేష్‌ చెప్పిన వీడియోను పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu