HomeTelugu Big Storiesమహేష్ ఫ్యాన్స్ బీ రెడీ!

మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ!

మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ ‘The vision of bharat’ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించారు. కొరటాల శివ-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తనన్న ‘భరత్‌ అనే నేను’ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారు.
mahesh 1
చదువు విషయంలో ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఓ సీఎంగా మహేశ్‌ ఏం చేశాడు అన్న కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.
ఈ చిత్రంలో దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ నటిస్తోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu