HomeTelugu Big Storiesమీ వెడ్డింగ్ కార్డ్ మాకు పంపిస్తే మీకు పట్టువస్త్రాలు పంపిస్తాం: దిల్‌రాజు

మీ వెడ్డింగ్ కార్డ్ మాకు పంపిస్తే మీకు పట్టువస్త్రాలు పంపిస్తాం: దిల్‌రాజు

3a 2

దిల్‌ రాజు, లక్ష్మణ్ నిర్మాణంలో నితిన్, రాశీ ఖన్నా జంటగా శ్రీనివాస కల్యాణం సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేగ్నేశ దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనిలో భాగంగా దిల్ రాజు శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే జంటలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.

3 6

 

”బొమ్మరిల్లు రిలీజ్‌ అయిన రోజు ఆగస్ట్ 9 మాకు చాలా సెంటిమెంట్. బొమ్మరిల్లు తర్వాత 12 ఏళ్లకు మళ్లీ ఈ డేట్ కుదిరింది. డేట్ ఫిక్స్ అవగానే సతీష్ ఓ విషయం చెప్పారు. ‘శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ జంటలకు పట్టు వస్త్రాలు ఇస్తే బాగుంటుంది’ అన్నారు. ఈ విషయమై వారం క్రితం కళామందిర్ కల్యాణ్‌కు చెప్పగానే ‘మేము మీ టీంకు సహకరిస్తాం’ అని ముందుకొచ్చారు. శ్రావణమాసంలో పెళ్లిళ్లు చేసుకోబోతున్న జంటలకు పట్టువస్త్రాలు అందిస్తాం. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే జంటలు మీ వెడ్డింగ్ కార్డ్ మాకు ఫేస్‌బుక్ ద్వారా పంపిస్తే మీ అందరికీ పట్టు వస్త్రాలు పంపిస్తాం. కొందరికి మా టీం స్వయంగా వచ్చి ఇస్తుంది” అని దిల్ రాజు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu