HomeTelugu Big Storiesమేం ప్రజాకర్షక పథకాలు ప్రకటించం..ప్రజల అవసరాలు తీర్చుతాం'..!

మేం ప్రజాకర్షక పథకాలు ప్రకటించం..ప్రజల అవసరాలు తీర్చుతాం’..!

ఎన్నో కోట్లు పెట్టి ప్రభుత్వ పథకాలు ప్రారంభిస్తున్నారు.. ప్రజా అవసరాల కోసమే వీటిని ప్రవేశపెడుతున్నామని చెబుతున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి రావడానికి మెనిఫెస్టోలంటూ కోట్ల రూపాయల వ్యయంతో ఎన్నో పథకాలను ప్రారంభిస్తామని చెబుతున్నారు.. అయితే వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? వేల కోట్ల అప్పులున్న రాష్ట్ర లక్ష కోట్లకు ఎందుకు పెరిగింది..? తెలంగాణలో అభివృద్ధి కావడానికి ఎన్నో వనరులున్నాయి.. కాని వాటిని పరాయి వాళ్లు దోచుకెళ్తున్నారని చెప్పిన నాయకులు ఇప్పుడు చేసిందేమిటి..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

IMG 20181107 WA0028

ఈ ప్రశ్నలకు సమాధానం మా పార్టీలో దొరుకుతుందని అంటున్నారు ‘ప్రజా పార్టీ’ అధ్యక్షుడు అజీజ్‌ మహమ్మద్‌. కేవలం ప్రజా అవసరాలను తీర్చే పార్టీగా స్థాపించిన మా పార్టీ ప్రజాకర్షక పథకాలు ప్రకటించకుండా వారు బాగోగులు చూసుకోవడమే మా ధ్యేయం అంటున్నారు. కేవలం మాకున్న ఆలోచనలే కాకుండా ప్రజల దగ్గరకు వెళ్లి వారికేం కావాలో తెలుసుకున్న తరువాతే ప్రజా పార్టీని స్థాపించామన్నారు. మేం మెనిఫెస్టోను తయారు చేయడానికి మాదగ్గర ఉన్న సభ్యులు సమావేశం నిర్వహించం.. ప్రజల దగ్గరకు వెళ్లి వారి అవసరాలేంటో తెలుసుకొని మెనిఫెస్టోను నిర్వహిస్తామని అజీజ్‌ మహమ్మద్‌ పేర్కొంటున్నారు.

ఒకరు కాకపోతే మరొకరు..ఇలా రాష్ట్ర అధికారాన్ని పంచుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేసే నాయకుడు లేడనే అర్థమవు తోందని ఆయన ఆ పార్టీ నాయకులు అంటున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు తాము ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశామని ఒక్కరైనా ధైర్యంగా చెప్పగలరా..? అంతకుముందున్న నాయకులు మొన్నటి ప్రభుత్వ లోపాలు చెబుతున్నారా..? లేదు. ఎందుకంటే వారికి తిట్లు మాత్రమే కావాలి. వారి స్వప్రయోజనాలు కావాలి. ఈ ప్రాంతానికి ఇది అవసరం దానిని ఎలా తీసుకురావాలో చెప్పే నాయకుడు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే మేం మా ప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఎన్నికల్లో పోటీకి నిలబడాలని నిర్ణయించుకున్నామని ‘ప్రజా పార్టీ’ అధ్యక్షుడు అజీజ్‌ మహమ్మద్‌ పేర్కొంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu