HomeTelugu Big Storiesరాజశేఖర్‌ 'కల్కీ'

రాజశేఖర్‌ ‘కల్కీ’

1983 నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఓ సినిమాలో సీనియర్‌ నటుడు రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్నారు. నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలో రాజశేఖర్‌ నటిస్తున్న ఈ చిత్రాని తెరకెక్కించనున్నారు.

3 28

కాగా ఈ సినిమా ట్రైటిల్‌ లోగోను రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం రిలీజ్‌ చేశారు. శ్రీ మహా విష్ణువు దశావతారాలకు సంబంధించిన వివిధ వస్తువులతో ఈ టైటిల్‌ టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. ఈ మూవీకి కల్కీ టైటిల్ ను ఖరారు చేశారు. నిర్మాత సీ కల్యాణ్‌తో కలిసి రాజశేఖర్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సెప్టెంబర్‌ నుంచి ప్రారంభం కానుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu