HomeTelugu Big Storiesరియల్‌ చంద్రబాబుని కలిసిన రీల్‌ చంద్రబాబు

రియల్‌ చంద్రబాబుని కలిసిన రీల్‌ చంద్రబాబు

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ కలయికలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు జీవిత ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ముఖ్యమైనదే.. అయితే.. ఈ కథలో కీలకమైన ‘చంద్రబాబునాయుడు’ పాత్రకు రానాను ఎంపిక చేశారు. మరోకొద్ది రోజుల్లోనే తన షూటింగ్‌ పార్ట్‌ ప్రారంభం కానుండడంతో ఇవాళ బాలకృష్ణ, క్రిష్‌ను రానా కలిశారు.

8 1

సాయంత్రం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వీరు ముగ్గురూ భేటీ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించి చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. అయితే.. ఏపీ సినీ పరిశ్రమ అభివృద్దికి సానుకూలమైన వాతావరణ ఉందని, ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్టంలో ఉన్నాయని, ఇవి సినీ పరిశ్రమకు ఇవి ఉపయోగపడుతాయి అని చంద్రబాబు తెలిపారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu