HomeTelugu Big Storiesచిరంజీవికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌!

చిరంజీవికి జంటగా మృణాల్‌ ఠాకూర్‌!

Mrunal Thakur in Chiranjeev
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా156’. బింబిసార దర్శకుడు వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. యూవీ- చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఫిక్స్‌ చేసినట్లు టాక్‌. ఈ సినిమాలో ముల్లోకాల వీరుడుగా చిరంజీవి కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈసినిమాలో చిరంజీవి సరసన ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారని మొదటి నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రిష ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇక తాజాగా సీతారామం ఫేం మృణాల్‌ ఠాకూర్‌ కూడా హీరోయిన్‌గా ఎంపికైనట్లు టాక్‌.

కథానుసారం ఈ చిత్రంలో చిరు.. మూడు లోకాలను తిరిగే వీరుడుగా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో మృణాల్, త్రిష దేవకన్యలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. కథ ఇలా ఉంటుంది కాబట్టే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను పోలి ఎలాంటి సీన్స్ తీయడానికి వీల్లేదని వైజయంతీ మూవీస్ ఆల్రెడీ చెప్పుకొచ్చారు.

అయితే .. వశిష్ఠ మాత్రం అలానే సీన్స్ తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో మృణాల్.. దేవకన్యగా కనిపించబోతుంది అంట. అతిలోక సుందరి శ్రీదేవిలా ఆమె లుక్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. వీరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లను వెతికే పనిలో పడ్డారట చిత్ర బృందం.

.

Recent Articles English

Gallery

Recent Articles Telugu