HomeTelugu Newsరోబోను రుచి చూపించనున్న శంకర్‌

రోబోను రుచి చూపించనున్న శంకర్‌

రజినీకాంత్.. శంకర్‌ల రోబో 2.ఓ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది. గత ఏడాది దీపావళి విడుదల కావాల్సిన సినిమా విజువల్ ఎఫక్ట్స్, గ్రాఫిక్స్ వర్క్స్ కారణంగా లేట్ అయింది. అసలు సినిమా వస్తుందా రాదా అనుకుంటున్నా సమయంలో శంకర్ సినిమా విడుదల తేదీని ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.

1 40

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెండు సినిమాల మేకింగ్ వీడియో బిబిసిలో ప్రసారం అయింది.మేకింగ్ వీడియోలో లేడీ రోబో అమీ జాక్సన్ గురించి చూపించారు. చిట్టి గురించి, క్రౌ మ్యాన్ గురించి అలా టచ్ చేసి వదిలేశారు. అసలు వీరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొన్నది. నవంబర్ 29 న సినిమా రిలీజ్ చేస్తారు అని ఇప్పటికే ప్రకటించారు.. అయితే, టీజర్, ట్రైలర్ సంగతి ఏంటి.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేదానిపై నిన్నటి వరకు క్లారిటీ లేదు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. వినాయకచవితి సందర్భంగా రోబో 2.ఓ టీజర్ ను రెండు వెర్షన్స్ లో రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. 2డి, 3డి వెర్షన్స్ లో టీజర్ ను రిలీజ్ చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu