పవన్‌ కల్యాణ్‌తో అనుష్క?

టాలీవుడ్‌ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా తరవాత క్రిష్ డైరెక్షన్ లో పవన్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో పవన్‌- క్రిష్‌ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హిస్టారికల్‌ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ బందిపోటు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ ‘విరూపాక్ష’గా ఫిక్సయిందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి‌. తాజాగా ఈ చిత్రంలో అనుష్క పవన్‌ సరసన నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో జాక్వలిన్‌, అనుష్కల వైపు క్రిష్‌ మొగ్గు చూపుతున్నట్లు ఫిలింనగర్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈవార్తల్లో నిజం ఎంత అనే దానిపైన చిత్రయినిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.