‘రాజుగారి గది 2’ మూడవ షెద్యూల్ పూర్తి!

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న రాజుగారి గది చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రం ‘రాజుగారి గది 2’. ఒయాక్ ఎంటర్ టైన్మెంట్స్, పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండగా.. సమంత ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఏప్రిల్ 3 చిత్ర కథానాయకి సీరత్ కపూర్ పుట్టినరోజును పురస్కరించుకొని.. సీరత్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ”పాండిచ్చేరిలో 20 రోజులపాటు జరిగిన మొదటి షెడ్యూల్ తో దాదాపు 70% టాకీ పార్ట్ పూర్తయ్యింది. నాగార్జున, నరేష్, సమంత, సీరత్ కపూర్, సీనియర్ నరేష్ ల నడుమ కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. చిత్రీకరణ సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ స్టిల్స్ కి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది. ముఖ్యంగా నాగార్జున ఈ చిత్రంలో మరింత అందంగా కనిపిస్తున్నారని అందరూ వ్యాఖ్యానిస్తుండడం విశేషం. ఇక నేడు మా హీరోయిన్ సీరత్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశాం. ఈ చిత్రంలో సీరత్ పాత్ర చాలా కీలకం, ఆమెకు లభించిన ఈ క్యారెక్టర్ ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలవడం ఖాయం” అన్నారు.