HomeTelugu Newsవైరల్‌ అవుతున్న మహేష్‌ R I S

వైరల్‌ అవుతున్న మహేష్‌ R I S

‘భరత్‌ అనే నేను’ సినిమా తరువాత మహేష్‌ తన 25 వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యే మహేష్‌ బాబుపై కాలేజ్‌ సీన్స్‌ను తెరకెక్కించారు. అయితే ఆగస్టు 9న ఈ సూపర్‌ స్టార్‌ పుట్టిన రోజు. అసలే మహేష్‌కు భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఇక ఈ టాలీవుడ్‌ ప్రిన్స్‌ పుట్టిన రోజున అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రబృందం.. గత రెండు రోజులుగా కొన్ని అక్షరాలను ( R I S ) సోషల్‌మీడియాలో రిలీజ్‌ చేస్తున్నాయి.

6 4

వాటిని ఆధారంగా చేసుకున్ని ఫ్యాన్స్‌… సినిమా టైటిల్‌ను ఊహించేసుకున్నారు. ఇప్పుడు వారు ఊహించిన పేరు కూడా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘రిషి’ అని టైటిల్‌ ఉంటుందని కొందరు.. మహేష్‌ చేయబోయే పాత్ర పేరు రిషి కావొచ్చని మరికొందరు కామెంట్స్‌ పెడుతున్నారు. ఏదేమైనా.. ఆగస్టు 9న వీటన్నింటికి ఓ సమాధానం దొరకనుంది. కాగా ఈచిత్రంలో మహేశ్‌ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. యువ కథానాయకుడు అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్విని దత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu