Homeతెలుగు Newsవైసీపీ అభ్యర్థులు.. అంతా చదువు కున్నవాళ్లే..

వైసీపీ అభ్యర్థులు.. అంతా చదువు కున్నవాళ్లే..

ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా.. ఇప్పుడు ఇదే ఫార్ములాను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనుసరించారు. కొత్త రాజకీయాలకు తెరతీశారు. ఎవ్వరూ ఊహించని వారికి టికెట్లు ఇచ్చారు. అఖిల భారత, ఐఏఎస్, ఐపీఎస్, రాష్ట్ర ఉద్యోగులకు కూడా టికెట్లు ఇచ్చారు. నవతరం యువకులకు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టని వారికి సైతం భోరోసా కల్పిస్తూ వైఎస్ జగన్ టికెట్ కేటాయించడం విశేషం.

ys jagan andhra pradesh CM

బాపట్ల నుంచి ఎస్సీ దళిత సామాజికవర్గానికి చెందిన నందిగం సురేష్ కు టికెట్ ఇచ్చి జగన్ ఆశ్చర్యపరిచాడు. ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన తనకు సీటు వస్తుందని అస్సలు ఊహించలేదని.. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేని తనకు బాపట్ల లోక్ సభ సీటు ఇవ్వడం సంతోషంగా ఉందని సురేష్ వ్యాఖ్యానించారు.

ఇక అనంతపురం లాంటి రెడ్డీల కోటలో కూడా బీసీల్లో మెజార్టీ వర్గంగా ఉన్న బోయ సామాజికవర్గం నుంచి రంగయ్య, కురుబ సామాజికవర్గం నుంచి పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్ కు జగన్ టికెట్ కేటాయించి తన గొప్పతననాన్ని చాటుకున్నారు. బీసీల అభ్యున్నతికి వైసీపీ చిత్తశుద్ధిని దీన్ని బట్టి అర్థమైందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. వీరిద్దరూ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులుగా విధులు నిర్వర్తించారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నించినందుకు బెదిరింపు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇలా ధైర్య శీలురకు జగన్ సీట్లు ఇచ్చి గౌరవించడం విశేషంగా చెప్పవచ్చు.

*వైసీపీ అభ్యర్థులు ఎవరు ఏ వర్గానికి చెందిన వారంటే..
+ అభ్యర్థుల్లో 9 మంది ఆల్‌ఇండియా సర్వీసుల్లో పనిచేసినవారే..
+డాక్టర్లు 15 మంది
+ 175 అభ్యర్థుల్లో 45 ఏళ్లలోపువారు 33 మంది
+ 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది
+ 60 ఏళ్లకు పైబడ్డ వారు కేవలం 44 మంది
+సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు 40 మంది
+ 119 మంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా పోటీచేసిన వారు
+145 మంది ఆ పదవులకు పోటీపడ్డవారు
+  మరో 24 మంది ఎమ్మెల్సీలకు అవకాశం
+ ముగ్గురికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నూతన అవకాశం
+ గతంలో మంత్రులుగా పనిచేసినవారు 12 మంది
+ మాజీ ఎంపీలు ఇద్దరు
+ మాజీ ఎమ్మెల్యేలు 37 మంది
+ మాజీ ఎమ్మెల్సీ 1
+ ఎంపీలుగా పోటీచేసిన వారు 3
+ ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వారు 21
+ అభ్యర్థుల్లో 15 మంది వైద్యులు
+ అఖిలభారత సర్వీసు అధికారులుగా పనిచేసిన వారు 9
+ పోస్ట్‌గ్రాడ్యుయేట్లు 41 మంది
+ గ్యాడ్యుయేట్లు 98
మొత్తం మీద డిగ్రీ, ఆపైబడి చదివిన విద్యావంతులు 139 మంది ఉండడం విశేషం. జగన్ ఈసారి కప్పదాటు నేతలకు, పలుకుబడి నేతలకు కాకుండా సమతుల్యమైన జాబితాను ప్రకటించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu