
Samantha and Naga Chaitanya Love Story:
నాగ చైతన్య – సమంతల జంట గురించి మనకి కొత్తగా చెప్పాలసిన పని లేదు. ఒక్కప్పుడు అందరి ఫేవరెట్ జంట. వీళ్లిద్దరూ కలిసి నటించిన “యే మాయ చెసావే” సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. అదే సినిమాకి ఇప్పుడు రీ-రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది. ఈ సందర్భంలో వీళ్లిద్దరూ కలిసి ప్రమోషన్స్ లో కనిపిస్తారా అనే కోణంలో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
“యే మాయ చెసావే” సమంతకు డెబ్యూ సినిమా. నాగ చైతన్యకి లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయి తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని సంవత్సరాల తరువాత విడిపోయారు.
ప్రస్తుతం ఇద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకెళ్లిపోయారు. నాగ చైతన్య మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడు. సమంత అయితే సోషల్ మీడియాలో తన ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ గురించి తరచూ పోస్ట్ చేస్తూ కనిపిస్తోంది. అలాంటప్పుడు వీళ్లిద్దరూ కలిసి ప్రమోషన్స్ కు రావడం సాధ్యమేనా అనే సందేహం అభిమానుల్లో ఉంది.
విడాకుల తర్వాత కూడా వీళ్లిద్దరూ ఈ సినిమాని గురించి మంచి మాటలే చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలానే మారిపోయాయి. సమంత ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రెడీ అయినా నాగ చైతన్య మాత్రం దూరంగా ఉండే ఛాన్సే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు.
ఇది ఒక రకంగా యే మాయ చెసావేకు కొత్తగా పబ్లిసిటీ తీసుకొచ్చినా, ఫ్యాన్స్ మాత్రం నాగ చైతన్య-సమంతల రీయూనియన్ ని చూడాలని ఆశపడుతున్నారు. కానీ ఇది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంది.