
Kajal Aggarwal Direction:
భగవంత్ కేసరి సినిమాతో సక్సెస్‌ఫుల్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త మలుపు తీసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ గాసిప్ హల్‌చల్ చేస్తోంది. హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన కాజల్ త్వరలో డైరెక్టర్ అవ్వబోతుందట. ఈసారి కథను చెప్పే బాధ్యతను తన భుజాలపై వేసుకుంటోంది.
కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, తన మొదటి సినిమాను తానే ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అంటే డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగా కూడా పరిచయం కాబోతున్నది కాజల్. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్స్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టినా, డైరెక్షన్‌లో మాత్రం అంతగా రాలేదు. కాజల్ ఈ సాహసంతో నిజంగా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను ఏర్పరచనుందని అంటున్నారు.
View this post on Instagram
ఇప్పటికి అయితే అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే కాజల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఆమె డైరెక్షన్ టాలెంట్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు బయటకు రాలేదు. కథ ఏది? హీరో ఎవరు? ఏ బ్యానర్‌పై తెరకెక్కుతుందో అన్నది త్వరలో క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది నిజం అయితే, కాజల్ కెరీర్‌లో ఇదొక పెద్ద మైలురాయిగా నిలవనుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం కాజల్ అగర్వాల్ విశ్ణు మంచు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తోంది. ఆ మూవీ షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. మొత్తానికి కాజల్ కెరీర్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఛాప్టర్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Allu Arjun Shaktimaan న్యూస్ వెనుక అసలు కారణం అదేనా?