HomeTelugu Newsశ్రీదేవి పాత్రలో ఎవరో తెలుసా?

శ్రీదేవి పాత్రలో ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితంతో ముడిపడి ఉన్న అనేక పాత్రలు ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. అలాంటి ముఖ్యమైన పాత్రల్లో ఒకటి శ్రీదేవి పాత్ర. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది. శ్రీదేవి మనవరాలిగా కూడా ఎన్టీఆర్ పక్కన నటించింది. శ్రీదేవి పాత్రకోసం యూనిట్ అనేకమంది బాలీవుడ్ నటీమణులను కలిసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా, శ్రద్దా కపూర్ లను ఈ పాత్ర కోసం సంప్రదించారని వార్తలు వచ్చాయి. చివరకు రకుల్ ప్రీత్ ను ఎంపిక చేశారట.

10 6

ఈ విషయంపై యూనిట్ స్పందించింది. శ్రీదేవి పాత్ర కోసం బాలీవుడ్ నటీమణులు ఎవరిని సంప్రదించలేదని, మొదటి నుంచి తమ ఛాయస్ రకుల్ మాత్రమే అని ఆమెనే ఎంపిక చేశామని యూనిట్ చెప్తున్నది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నాలుగు సినిమాల్లో బిజీగా ఉందట. ఎన్టీఆర్ సినిమా కోసం డేట్స్ ను సర్దుబాటు చేసుకుంటున్నదని యూనిట్ చెప్తున్నది. కాగా ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపుగా 30శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. బసవతారకం పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తయినట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu