HomeTelugu News'శ్రీనివాసకల్యాణం' ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన మహేష్‌ బాబు

‘శ్రీనివాసకల్యాణం’ ట్రైలర్‌ రిలీజ్‌ చేసిన మహేష్‌ బాబు

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నితిన్‌ హీరోగా దిల్‌రాజ్‌ నిర్మిస్తున్నన చిత్రం ‘శ్రీనివాసకల్యాణం’. విగేశ్న దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్ లో ‘సంక్రాంతి పండగ ఏడాది ఒకసారి వస్తుంది. కానీ, జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే పెద్ద పండగ పెళ్లి’ అంటూ వివాహానికి అర్థం చెబుతున్నారు.

6b

‘నాయనమ్మా! పెళ్లంటే ఏంటి?’ అని జయసుధ మనవడు ఆమెను అడిగితే ‘పెళ్లంటే పెద్ద పండగ’ అంటూ మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక నితిన్‌-రాశీఖన్నాల మధ్య వచ్చే సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోయాయి. ‘ఈ అమ్మాయిలతో ప్రాబ్లమ్‌ ఇదేరా! వాళ్లని మనం చూసినా, మనం వాళ్లని చూసినా, డిస్ట్రబ్‌ అయ్యేది మనమే!’ ‘కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిలను పొగడాల్సిందేగా’ అంటూ వచ్చే సంభాషణలు బాగున్నాయి. కాగా ఈ చిత్రంలో నందితా శ్వేత, ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌ ఇలా భారీ తారాగణం సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

6

Recent Articles English

Gallery

Recent Articles Telugu