HomeTelugu News'శ్రీనివాస కళ్యాణం' ట్రైలర్‌ విడుదల చేయనున్న సూపర్‌ స్టార్‌

‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌ విడుదల చేయనున్న సూపర్‌ స్టార్‌

దిల్‌రాజు నిర్మాణంలో నితిన్‌ హీరోగా నటిస్తున్నచిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. శతమానం భవతి వంటి చక్కని సినిమాను తీసిన వేగేశ్న సతీష్ ఈ శ్రీనివాస కళ్యాణం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథాచిత్రంగా తెకకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తయ్యింది. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో ఈ చిత్రం చిత్రకరణ పూర్తి చేశారు.

3

ఇప్పటికే నిర్మాణాంతర కార్మక్రమాలు కూడా ప్రారంభమైన ఈ సినిమాను ఆగస్టు 9న రిలీజ్‌ చేసేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ జోరుగ పెంచిన చిత్రయూనిట్‌ సూపర్‌ స్టార్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయిస్తున్నారు. ఆగస్టు 2వ తేదీన (రేపు) సాయంత్రం ఐదు గంటలకు ముప్పై నిమిషాలకు మహేష్‌ బాబు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేయనున్ననారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu