Homeతెలుగు Newsసామాజిక సేవలో ‘మేఘా’ నే ముందు

సామాజిక సేవలో ‘మేఘా’ నే ముందు

ఇంజనీరింగ్ రంగంలో అగ్రగామి సంస్థ  మేఘా ఇంజనీరింగ్ సామాజిక సేవలోనూ ఎల్లపుడూ ముందువరుసలో ఉంటుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత గా ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక గ్రామాలను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నది. అంతేకాకుండా ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట ఉండే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తుంది. క్యాన్సర్ బాధిత చిన్నారులను అక్కున చేర్చుకుని, వారికీ మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సామగ్రిని అందిస్తున్నది. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో అత్యాధునిక వసతులతో క్యాన్సర్ బాధితుల కోసం అంకాలజీ భవనాన్ని నిర్మించి ఇచ్చింది. అంతేకాదు అన్నదాతలకే అన్నం పెట్టే సద్దిమూట కార్యక్రమాన్ని కూడా ఎంఇఐఎల్ నిర్వహిస్తున్నది.

 

గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో: 

దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. ఆ నానుడిని నిజం చేసేలా MEIL తన సేవా కార్యక్రమాలను గ్రామాలకు విస్తరించింది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే గ్రామాల అభివ్రుద్ధిని విస్మరిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా.. కేవలం గ్రామాలకు సేవ అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ గ్రామాలను దత్తత తీసుకొని వాటి వికాసానికి తోడ్పడుతున్నది.  గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంతోపాటు గ్రామాల వికాసానికి మేఘా తోడ్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోని జములపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంఇఐఎల్  40, 20 వేల కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆధునీకరించి, ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నది. ఈ పథకంలో ఫెరల్ అనే ఆత్యాధునిక టెక్నాలజీని వాడింది. దీని ద్వారా ప్రతి ఇంటికీ ఒకే ప్రెషర్ తో తాగునీరు వస్తుంది. జములపల్లిలో 12 కేవీ సోలార్ ప్లాంట్ తోపాటు రెండు మినరల్ వాటర్ ప్లాంట్ లను ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది.
కృష్ణా జిల్లాలోని డోకిపర్రు, ఖాజా గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్.. రెండు గ్రామాల్లో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్నది. డోకిపర్రు గ్రామంలో కళ్యాణ మండపం, దేవాలయం నిర్మించింది. మరుగుదొడ్లను, వీధుల్లో సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసింది. ఇదే గ్రామంలో రహదారులను ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న ఎంఇఐఎల్ ఖాజా గ్రామంలో తాగునీటి కష్టాలను దూరం చేయడంతోపాటు రహదారులను ఏర్పాటు చేసింది. ఈ గ్రామంలో సోలార్ విద్యుత్ దీపాలతోపాటు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది ఎంఇఐఎల్.

downloadfile

ప్రగతిపథంలో దత్తత గ్రామాలు: 
దక్షిణ భారతదేశంలోనే తొలి పీఎన్జీ గ్రామంగా డోకిపర్రు రికార్డ్ నెలకొల్పింది. మేఘా ఇంజనీరింగ్ డోకిపర్రు గ్రామంలో ఇంటింటికీ పైపుడ్ గ్యాస్ సదుపాయాన్ని 2019 జనవరి నుంచి కల్పిస్తున్నది. దీనివల్ల గ్రామస్తులకు తక్కువ ధరలో గ్యాస్ లభిస్తుంది.  ఇది చాలా సురక్షితమైనది కూడా.
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలోని పస్పుల, మురహరిదొడ్డి గ్రామాలను దత్తత తీసుకున్న మేఘా. ఈ గ్రామాల్లో రహదారులను నిర్మించడంతో పాటు సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. పస్పుల, మురహరిదొడ్డి గ్రామాల్లో 250 ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.
రాయలసీమ ప్రాంతంలో నాగళాపురం, గంజిగుంటపల్లి గ్రామాలను దత్తత తీసుకున్న ఎంఇఐఎల్… ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో బేంచీలు, డెస్కులను అందించారు. కళ్యాణ మండపాలు నిర్మించడంతోపాటు, పార్కులను ఏర్పాటు చేశారు.
ఆకలి తీరుస్తున్న భోజనామృతం:
ఆసుపత్రుల్లోని రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఎంఇఐఎల్ భోజనామృతం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తొలివిడుతలో హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రితోపాటు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో రోగులకు, వారి వెంట వచ్చే బంధువులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మలివిడుతలో నిజామాబాద్,  బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పించిస్తున్నది ఎంఇఐఎల్. ఇలా సంత్సరంలో దాదాపు 10 లక్షల మంది ఆకలి తీరుస్తున్నది మేఘా.
హైదరాబాద్ లోని ఎం.ఎన్.జే క్యాన్సర్ ఆసుపత్రిలోని చిన్నారులకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది మేఘా. హైదరాబాద్ లోని ప్రాణం ఫౌండేషన్ కు చెందిన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఎంఇఐఎల్ బాసటగా నిలుస్తూ, వారికి వైద్యం అందిస్తున్నది. వరంగల్ నగరంలో న్యూలైఫ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు చెందిన హెచ్ఐవీ బాధిత చిన్నారులకు భోజనం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. సద్దిమూట కార్యక్రమం ద్వారా సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ యార్డ్ లలో రైతులు, హమాలీల ఆకలిని తీరుస్తున్నది ఎంఇఐఎల్.
కార్పోరేట్ కి దీటుగా:
నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో అంకాలజీ ఆసుపత్రి భవనాన్ని మేఘా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించింది. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా నిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలను ఎంఇఐఎల్ కల్పించింది. ఇందులో డాక్టర్, నర్సులకు వార్డులు, ఎమర్జన్సీ వార్డు, ల్యుకేమియా వార్డు, మహిళలు, పురుషులకు వార్డులతోపాటు పిల్లలకు కూడా ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఐసీయూ, బెడ్లు, ఆక్సీజన్ సదుపాయాలు, సెంట్రలైజ్డ్ ఏసీ సదుపాయం, బెడ్ లిఫ్ట్ లను మేఘా ఏర్పాటు చేసింది. 2018 సెప్టెంబర్ 23న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మంత్రి K. తారకరామారావు చేతుల మీదుగా అంకాలజీ భవనాన్ని ప్రారంభించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu