HomeTelugu Trendingసాయి పల్లవితో నాగచైతన్య 'లవ్‌స్టోరీ'

సాయి పల్లవితో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’

4 24అక్కినేని నాగచైతన్య ‘మజిలీ’ చిత్రం తరువాత జోష్ మీద ఉన్నాడు. ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేశాడు చై. కాగా ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుంది. ఈ మూవీ కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

శేఖర్ కమ్ముల ఈ సినిమాకు క్యాచీగా ఉండే టైటిల్ ను పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం. గతంలో గోదావరి, హ్యాపీ డేస్, ఫిదా సినిమా టైటిల్స్ ఎంత క్యాచీగా ఉన్నాయో అలాంటి టైటిల్ నే అనుకుంటున్నారని సమాచారం. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీతో కూడిన సినిమా కాబట్టి, దీనికి లవ్ స్టోరీ అనే టైటిల్ అనుకున్నారని తెలుస్తోంది. ఫైనల్ షెడ్యూల్ జరుపుకోబోతున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu