HomeTelugu Newsసిక్స్ ప్యాక్ తో ప్రిన్స్‌ రీఎంట్రీ

సిక్స్ ప్యాక్ తో ప్రిన్స్‌ రీఎంట్రీ

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్‌గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్‌కు ఈ కథ గ్రాండ్ రీ లాంచింగ్‌గా ఉండబోతోంది. ఒకరకంగా ఈ మూవీతో ప్రిన్స్ సరికొత్తగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ మార్చుకున్నాడు. లుక్‌లో మార్పు కోసం ప్రయత్నించాడు. అలాగే ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.

15 1

ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచి ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రం ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్ స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ కథకు అవసరమైనట్టుగా తనను తాను మార్చుకుని ప్రిన్స్‌ నటిస్తోన్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతోంది.

ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఈ మూవీ లఢక్, గోవా, హైదరాబాద్‌తో పాటు వారణాసి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనుంది. గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఏ. సుశాంత్ రెడ్డి మరోసారి తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. అతి త్వరలో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ఆ వెంటనే రెగ్యులర్ షూట్‌కు వెళుతుంది. వి కృష్ణారావు కొల్లూరి సమర్పిస్తోన్న ఈ చిత్రం ‘సోరింగ్ ఎలిఫెంట్’ బ్యానర్‌పై రూపొందనుంది. హరి గౌర సంగీతం అందిస్తున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu