త్రిషకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏంటో..?

ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష.. ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా తమిళంలో ‘సామి’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘సామి2’ సినిమాలో త్రిషను హీరోయిన్ గా ఎన్నుకున్నారు. ఈ సినిమా త్రిషతో పాటు మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా కనిపించబోతుంది. అయితే ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వెల్లడించింది త్రిష.

‘క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా సినిమా నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆల్ ది బెస్ట్ టు సామి2’ అంటూ చెప్పుకొచ్చింది.

ఓ డైరెక్టర్ కి, సినిమాటోగ్రాఫర్ కు లేదంటే డైరెక్టర్ కు మ్యూజిక్ డైరెక్టర్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే రావొచ్చు.. కానీ హీరోయిన్ కు సినిమా టీం తో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏంటో..? అవి త్రిషకే తెలియాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
హరి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.