HomeTelugu Newsసిల్లీ ఫెలోస్‌ బైక్‌ రైడ్‌

సిల్లీ ఫెలోస్‌ బైక్‌ రైడ్‌

అల్లరి నరేష్.. తాజాగా తనకు చివరి హిట్‌ సుడిగాడు సినిమాను అందించిన భీమినేని శ్రీనివాస్‌ దర‍్శకత్వంలో సిల్లీ ఫెలోస్‌ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు‌. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నరేష్‌ తో పాటు మరో కామెడీ హీరో సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. . ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.కామోడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ రిలీజ్ అయ్యింది.

1 38

ఈ టీజర్లో బైక్‌ పైన వెళుతున్న నరేష్‌.. నరేష్ వెనుక నడుముని పట్టుకుని వేలాడుతూ సునీల్ కనిపిస్తాడు.. ‘ఈ స్పీడులో వెళ్తే గంటలో శ్రీశైలం వెళ్లొచ్చు కదరా’ అని నరేష్ అంటుండగా.. ‘గంటెందుకురా అరగంటలోనే వెళ్లిపోతాం కైలాసానికి’ అని సునీల్ అంటాడు. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu