ఇఫ్తార్ విందులో స్వీట్లు తినిపించుకున్న జగన్, కేసీఆర్


హైదరాబాద్ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హజరయ్యారు. రాజ్ భవన్ లోని సాంస్కృతిక మందిరంలో జరిగిన ఇఫ్తార్ విందులో ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇరువురు ముఖ్యమంత్రులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ నరసింహన్ తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.