‘సూపర్‌ మ్యాన్‌’గా బాలయ్య?


నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు రాగా ఇది మూడో సినిమా. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే రెగ్యూలర్ ఫూటింగ్ ప్రారంభంకానుంది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈమూవీని నిర్మించగా..తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్బంగా ఈమూవీ టీజర్ ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. ఈ టీజర్ ను అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఒకటి వైరల్‌ అవుతుంది.

ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ ‘సూపర్ మ్యాన్’పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి టైటిల్‌‌ ‘సూపర్ మ్యాన్’ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates