కేరళ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘వానవిల్లు’

కేరళ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ‘వానవిల్లు’


రాహుల్‌ ప్రేమ్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ప్రతీక్‌, శ్రావ్య, శ్రీ సయ్యిని హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాతగా ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రం ఇటీవలే కేరళలో షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అయిన లంకా కరుణాకర్‌ దాస్‌ మాట్లాడుతూ..ఇదొక వెరైటీ ప్రేమకథ. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ మూవీ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఓ చక్కని ప్రేమకథ ఉంది. ఈ సినిమాకి కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా చాలా చక్కగా కుదిరింది. ప్రస్తుతం కేరళలో షెడ్యూల్‌ పూర్తయింది. ఇంతకు ముందు మలేషియా షెడ్యూల్‌ లో కొంత టాకీ పార్ట్, సాంగ్స్ షూట్ చేశాము. ఈ కేరళ షెడ్యూల్‌ లో టాకీ పార్ట్‌  షూట్ చేశాము. నెక్స్ట్ షెడ్యూల్‌ సెప్టెంబర్ ఫస్ట్  వీక్ నుండి ఆర్.ఎఫ్.సి. లో ప్రారంభం అవుతుంది. ఆగష్టు చివరివారంలో టీజర్ ను రిలీజ్ చేయనున్నాము…అని అన్నారు.
ప్రతీక్‌, శ్రావ్య, శ్రీ సయ్యిని, హేమ, ప్రభాస్‌ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్‌ ఫణి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్‌, డైలాగ్స్‌: పవన్‌, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ మేనేజర్‌: సుబ్బారావు, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: సుభాష్‌, నరేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: జై, మూర్తి, కెమెరామెన్‌: ఎస్‌.డి. జాన్‌, నిర్మాత: లంకా కరుణాకర్‌ దాస్‌, స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్‌-దర్శకత్వం: ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌.

a (10)

CLICK HERE!! For the aha Latest Updates