
Rashmika Mandanna Remuneration:
రష్మిక మందన్న.. ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్. “పుష్ప 2″లో ఆమె చేసిన పని చూసిన తర్వాత అందరూ ఆమె పారితోషికం బాగా పెరుగుతుందనుకున్నారు. కానీ జరిగిందేమో… అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.
“పుష్ప 2″కి రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ దాదాపు రూ.10 కోట్లు! ఇది 2024 డిసెంబర్‌కి రిలీజైన పెద్ద హిట్ సినిమా. అందరూ ఆమె రేంజ్ ఇప్పుడు టాప్ హీరోయిన్‌ల సరసన అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె చేసిన మూడు సినిమాల్లో మాత్రం పారితోషికం గణనీయంగా తగ్గిపోయింది.
View this post on Instagram
మొదటగా, “ఛావా” అనే హిందీ సినిమాలో ఆమెకి రూ.4 కోట్లు మాత్రమే ఇచ్చారట. ఆ సినిమా ఫిబ్రవరి 14, 2025న రిలీజ్ అయ్యింది. తర్వాత “సికందర్” అనే సినిమా వచ్చింది, ఇది మార్చి 30న విడుదలైంది. ఇందులో రష్మికకి రూ.5 కోట్లు ఇచ్చారట. ఇప్పుడిప్పుడే థియేటర్లలోకి వచ్చిన “కుబేరా” సినిమా కోసమైతే మళ్లీ రూ.4 కోట్లు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదంతా చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు – పాపులారిటీ తగ్గలేదు, సినిమాలెక్కువే ఉన్నాయ్… అయినా పారితోషికం ఎందుకు తగ్గింది?
అయితే రష్మిక మాత్రం ఫుల్ బిజీగానే ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న “థమా” అనే సినిమా షూటింగ్‌లో ఉంది. అలాగే “ది గర్ల్‌ఫ్రెండ్” అనే మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌లోనూ ఆమె నటిస్తోంది.
ALSO READ: ఈ సౌత్ సినిమాని చూసి Bollywood చాలా విషయాలు మార్చుకోవాలి!