HomeTelugu Newsతమన్నా 'ఓదెల-2' ఫస్ట్‌లుక్‌

తమన్నా ‘ఓదెల-2’ ఫస్ట్‌లుక్‌

1st Look from Odela 2

సంపత్‌ నంది -హెబ్బాపటేల్‌ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్‌ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’‌. ఈ సినిమాకి సీక్వెల్‌ ఓదెల 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్‌ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారు. ఈ రోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని మేకర్స్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు.

అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.. ఓం నమ: శివాయ.. అంటూ తమన్నా స్పెషల్‌ లుక్‌ షేర్ చేశారు. ఇప్పటివరకు గ్లామరస్‌, స్టైలిష్ రోల్స్‌లో నటించిన తమన్నా ఈ సారి మాత్రం రూట్‌ మార్చేసింది. ఓదెల 2 సినిమా కోసం శివశక్తిగా మారిపోయింది. శివశక్తి లుక్‌ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. ఇందులో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించబోతుందని తెలియజేశారు మేకర్స్‌ .

ఓదెల 2లో వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి కాంతార చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందించిన అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu