రేపే రవితేజ చిత్రం టీజర్

మాస్ హీరో రవితేజ నటిస్తున్న ‘అమర్, అక్బర్, ఆంటొని’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రంలో రవితేజ పక్కన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవివశంకర్, మోహన్ (సీవీఎమ్) సన్నాహలు చేస్తున్నారు. ఈ మూవీలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ బరోరా, అభిమన్యు సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.