ఈ గుర్తింపు మీకు ఎప్పుడో రావాల్సింది: జక్కన్న

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దీంతో అభిమానులు, సెలబ్రటీలు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అందరు అభిమానులు భావిస్తున్నట్టుగానే… ఈ గుర్తింపు మీకు ఎప్పుడో రావాల్సి ఉందని చెప్పారు.

అయితే మీరు ఎప్పుడూ చెప్పే విధంగా ఒకరి శ్రమకు గుర్తింపు ఊహించని విధంగా అందుతుందని అన్నారు. తాను ఒకవేళ ఈ విశ్వంతో మాట్లాడగలిగితే… కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా… ఒకటి ఎంజాయ్ చేశాక మరొకటి ఇవ్వమ్మా అని చెపుతానని తెలిపారు. దీంతో పాటు కీరవాణితో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఫొటోలో కీరవాణి ఛైర్ లో కూర్చొని వయోలిన్ వాయిస్తుండగా… రాజమౌళి ఆయన పక్కన కింద కూర్చున్నారు. ఈ ఆసక్తికర ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

CLICK HERE!! For the aha Latest Updates