మహేష్ వేడుకకు ముఖ్య అతిథిగా నాని


సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘మహర్షి’ విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకుంది. దీంతో యూనిట్ సభ్యులు భారీ ఎత్తున వేడుక నిర్వహహించాలని నిర్ణయించారు. ఈనెల 28న శిల్పకళా వేదికలో వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేచ్యురల్ స్థార్ నానిని ఆహ్వానించారట. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో మంచి సన్నిహిత్యం ఉండటం వలనే నాని ఈ వేడుకకు హాజరవుతున్నాడట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు స్టార్ హీరోలే ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు. కానీ మహేష్ కొత్తగా మీడియం రేంజ్ హీరోలను కూడా ఆహ్వానిస్తూ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు.