HomeTelugu Trending''త్రీ రోజేస్'' ట్రైలర్‌

”త్రీ రోజేస్” ట్రైలర్‌

3 Roses Trailer
డైరెక్టర్ మారుతి ”త్రీ రోజేస్” అనే వెబ్ సీరిస్ తో డిజిటల్ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ లో మారుతి ఈ సిరీస్ కు షో రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బా, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది.

ఈ సిరీస్ ఆహా ఓటీటీలో నవంబర్ 12 నుంచి ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – ముగ్గురు హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ – టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేసి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘3 రోజెస్’ సిరీస్ లో ఇషాన్, ప్రిన్స్, సంగీత్ శోభన్ , వైవా హర్ష, సత్యం రాజేష్, హేమ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రవి నంబూరి ఈ సిరీస్ కు కథ అందించగా.. మ్యాగీ దర్శకత్వం వహించారు. సన్నీ ఎమ్.ఆర్ సంగీతం సమకూర్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!