
August 15 Releasing Telugu Movies:
ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న నివేదా థామస్.. తాజాగా ఇప్పుడు 35 చిన్న కథ కాదు అనే ఒక ఆసక్తికరమైన సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ప్రియదర్శి, విశ్వదేవ్ రచ్చ కొండా, గౌతమి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా.. ఈనెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల కావాలి.
అయితే ఆగస్టు 15న ఇప్పటికే బోలెడు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాలు ఆగస్టు 15న విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా ఆయ్ అనే ఒక చిన్న బడ్జెట్ సినిమాతో పాటు విక్రమ్ హీరోగా నటించిన తమిళ సినిమా తంగలాన్ తెలుగు డబ్బింగ్ కూడా అదే రోజున విడుదల కాబోతున్నాయి.
ఒకే రోజు ఐదు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల మధ్య.. థియేటర్ల కోసం భారీ కాంపిటేషన్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కానీ తాజా సమాచారం ప్రకారం నివేద థామస్ ఈ సినిమాల హడావిడి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం.. ఆగస్టు 15 కంటే కొద్ది రోజులు ఆగి సినిమాని సెప్టెంబర్ ఐదున విడుదల చేస్తే బాగుంటుందని ప్లాన్ చేస్తోందట. దీనికి సంబంధించిన అధికారికా ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రముఖ టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాని సమర్పిస్తున్నారు. తెలుగులో మాత్రమే కాక తమిళ్, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
సెప్టెంబర్ 5న తళపతి విజయ్ హీరోగా నటించిన GOAT సినిమా తప్ప మరి సినిమా లేదు. కాబట్టి కాంపిటేషన్ కూడా తక్కువ ఉంటుంది అని చిత్ర బృందం ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ వాయిదాకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.













