HomeTelugu Trendingఅభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన రజనీకాంత్‌

అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన రజనీకాంత్‌

45 years rajini mashup
సూపర్ స్టార్ రజనీకాంత్ అంటేనే స్టైల్‌కు మరోపేరు. అతని ప్రత్యేకమైన స్టైల్‌తోనే అభిమానులను అలరిస్తున్నారు. రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చి ఈ నెల 15తో 45 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఇంతకాలంగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు రజనీకాంత్ కామన్ డీపీ, ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇది సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అభిమానులకు కృతజ్ఞతలు. నా సినీ జర్నీ మొదలై 45 ఏళ్లు పూర్తవుతుంది. మీకోసం కాకపోతే నేను ఇక్కడ ఉండను అంటూ రజనీ ట్వీట్ చేశారు. దక్షిణాది ప్రముఖులు మోహన్‌లాల్, పృథ్వీరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రజనీ అభిమానులు ఇప్పటికే సంబరాలు మొదలుపెట్టేశారు. తమిళనాడు వ్యాప్తంగా భారీ పోస్టర్లతో అదరగొట్టేస్తున్నారు. 45 ఏళ్ల రజనీయిజం అంటూ తలైవాను అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

తమిళంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంతో తెరగేట్రం చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. కె. బాలచందర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1975లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 చిత్రాల్లో నటించాడు తలైవా. స్టైల్‌ను తన ఇంటిపేరుగా మార్చుకున్న రజనీకాంత్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన దర్బార్ చిత్రం తర్వాత అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్‌కు కీర్తి చెల్లెలుగా నటిస్తున్నట్టు సమాచారం.

45 years rajini mashup2

Recent Articles English

Gallery

Recent Articles Telugu