HomeTelugu Trendingమీకేం కావాలో చెప్పండి.. విజయ్‌ దేవరకొండ బంపర్‌ ఆఫర్‌

మీకేం కావాలో చెప్పండి.. విజయ్‌ దేవరకొండ బంపర్‌ ఆఫర్‌

13 8
టాలీవుడ్‌ క్రేజీ హీరో.. విజయ్‌ దేవరకొండ నెటిజన్లకు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చారు. క్రిస్మస్‌, ‘న్యూఇయర్‌’లను పురస్కరించుకుని ఆయన ప్రతి ఏడాది కొంతమందికి స్పెషల్‌ గిఫ్ట్స్‌ను అందించేవారు. 2017 నుంచి ‘దేవరాశాంటా’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కొంచెం ప్రత్యేకంగా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది ఎవరికి ఏం కావాలంటే అవి ఇస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ఇది దేవరాశాంటా టైం. ఈ ఏడాది నేను డిసైడ్‌ అయ్యాను. మీకేం కావాలో చెప్పండి నేను వాటిని నిజం వాస్తవం. కనీసం తొమ్మిది, పది మందికైనా ఇస్తాను. దీంతోపాటు అవకాశమున్నంత వరకూ ఎక్కువ మందికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఫుల్‌ లవ్‌, స్మైల్‌, బి హ్యాపీ, మీకేం కావాలో #DeveraSantaకు పోస్ట్‌ చేయండి’ అని విజయ్‌ ప్రకటించారు.ఈ ఏడాది విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మిశ్రమ ఫలితాలను అందుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఆయన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రాశీఖన్నా, ఇజాబెల్లా, కేథరిన్‌, ఐశ్వర్య రాజేశ్‌లతో విజయ్‌ దేవరకొండ ఆడి పాడనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్స్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఫిబ్రవరి 14’న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితోపాటు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించనున్న ఓ సినిమాలో విజయ్‌ నటించనున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో విడుదలైన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో విజయ్‌ నిర్మాతగా మారారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu