Tollywood Tier 2 Heroes: ప్రేక్షకుల్లో సినిమా చూసే విధానంలో మార్పు వచ్చింది. కంటెంట్ బాగుంటే చాలు ఆ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. హీరో,హీరోయినల్‌లు ఎవరు అనేది చూడకుండా.. సక్స్‌స్ చేస్తున్నారు . 11 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్‌లో మొదటిసారిగా అత్తారింటికి దారేది సినిమాతో వంద కోట్ల మైల్ స్టోన్ దాటారు. ఆ తరువాత ఈ వంద కోట్ల క్లబ్‌లో చాలా మంది టాప్ హీరోలు వచ్చి చేరారు. అయితే ఈమధ్య చాలామంది టైర్-2 హీరోలు, అప్ కమింగ్ స్టార్ హీరోలు కూడా తమ సూపర్ హిట్ సినిమాలతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయారు.
తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో కేవలం 9 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. బాక్సాఫీస్ ముందు మోత మోగించేశాడు. కాగా ఇప్పటికీ ఈ సినిమా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్అవుతూనే ఉంది. ఈ సంక్రాంతికి తేజ సజ్జా కూడా ‘హనుమాన్’తో సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఏకంగా రూ.300 కోట్ల వరకు వసూలు చేశాడు. ఇంకా పలువురు హీరోలు కూడా ఈ మార్క్‌ను టచ్ చేసేశారు.
విజయ్ దేవరకొండ:
టాలీవుడ్‌లో ‘అర్జున్ రెడ్డి’ ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ఆ సినిమాతో 50 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాడు. ఆ తరువాత చేసిన ‘గీత గోవిందం'(2018) చిత్రంతో 100 కోట్లు వసూలు చేసి, ఈ ఘనత సాధించిన ఫస్ట్ టాలీవుడ్ టైర్-2 హీరోగా నిలిచారు. పరశురామ్ డైరెక్షనక్షలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 132 కోట్ల గ్రాస్ అందుకుంది. అప్పటి నుంచి 200 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్న విజయ్ కు నిరాశే ఎదురవుతోంది.
వరుణ్ తేజ్:
ఫిదా సినిమాతో హీరోగా మొదటి సూపర్ హిట్ అందుకున్నవరుణ్ తేజ్ ‘F 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో 2019 సంక్రాంతికి వచ్చిన ఈ కామెడీ ఎంటర్టెనర్, బాక్సాఫీసు దగ్గర రూ. 130 కోట్ల వరకూ కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా సక్సెస్‌లో విక్టరీ వెంకటేష్‌కి కూడా భాగం ఉంది.
పంజా వైష్ణవ్ తేజ్:
వైష్ణవ్ తేజ్ డెబ్యూతోనే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2021లో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ ఈ క్రెడిట్ సాధించాడు. అప్పటి నుండి సరైన హిట్ కోసం ట్రై చేస్తున్నాడు.
నిఖిల్ సిద్ధార్థ్:
హ్యాపీ డేస్‌తో పరిచయమైన నిఖిల్ నటించిన కార్తికేయ-2 సూపర్ హిట్ అయింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2022లో వచ్చిన ‘కార్తికేయ’ మూవీకి సీక్వెల్. దీంతో నిఖిల్ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఈ మిస్టికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ. 120 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
నాని:
నేచురల్ స్టార్ నాని గతేడాది ‘దసరా’ సినిమాతో తొలిసారిగా బాక్సాఫీస్ దగ్గర సెంచరీ కొట్టాడు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. 115 కోట్లకు పైగా వసూలు చేసింది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాలో నటిస్తున్నాడు.
సాయి ధరమ్ తేజ్:
సాయి ధరమ్.. గత ఏడాది ‘విరూపాక్ష’ మూవీతో తేజ్ కూడా 100 కోట్ల క్లబ్‌లో చేరాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వచ్చిన ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్.. ఫైనల్ రన్ ముగిసే నాటికి వంద కోట్లను క్రాస్ చేసింది. అలానే తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా కూడా రూ. 115 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.
తేజ సజ్జ:
‘హనుమాన్’ మూవీతో యంగ్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సూపర్ హీరో సినిమా, ఈ ఏడాది సంక్రాంతికి రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇంత తక్కువ టైమ్‌లోనే ఈ రేంజ్‌లో వసూల్ చేశాడు.
సిద్ధు జొన్నలగడ్డ:
‘టిల్లు స్క్వేర్’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్ లోకి లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. రెండేళ్ల క్రితం ‘డీజే టిల్లు’ సినిమా టైంలోనే ఈ మైలురాయిని అనుకుంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సిద్ధూ.. చెప్పి మరీ వంద కోట్లు కొట్టాడు. మార్చి చివరి వారంలో రిలీజైన ఈ మూవీ.. 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.101.4 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.