HomeTelugu Trendingఆనంద్ దేవరకొండ కేఫ్‌లో 50 శాతం డిస్కౌంట్

ఆనంద్ దేవరకొండ కేఫ్‌లో 50 శాతం డిస్కౌంట్

Anand Devarakonda
హీరో విజ‌య్‌ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ న‌టించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటోంది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమా గెలుపుతో ఫుల్ జోష్ మీదున్న ఆనంద్ త‌న ఫ్రెండ్స్‌తో కలిసి హైదరాబాద్‌లో ‘గుడ్ వైబ్స్ ఓన్లీ’ కేఫ్ పెట్టి హోటల్ బిజినెస్‌లోకి దిగాడు. ఈ విష‌యాన్ని బీఏ రాజు ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఈ శనివారం, ఆదివారం గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌కు వచ్చే కస్టమర్లు అందరికీ సగం బిల్లు తాను చెల్లిస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించారు. నేను ఏదైనా మీతోనే సెలబ్రేట్ చేసుకుంటానని మీకు తెలుసు. కాబట్టి అందరూ వచ్చేయండి. కేఫ్‌ను ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్‌-రాఘ‌వ నాకు తొలిసారి పెద్ద విజ‌యాన్ని అందించారు. మీ అంద‌రి ప్రేమ‌ మా క‌ల‌ల‌కు బ‌లం చేకూర్చింది. మా స్నేహితుల ఫుడ్ డ్రీమ్స్ క‌ల‌ నెర‌వేర్చ‌డానికి మొద‌టి చెక్కుతో పెట్టుబ‌డి పెట్టాను అని ట్వీట్ చేశాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu