HomeTelugu News"యూటర్న్" మూవీ ట్రైలర్‌

“యూటర్న్” మూవీ ట్రైలర్‌

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “యూటర్న్” కన్నడ హిట్‌ “యూటర్న్”కు తెలుగు రీమేక్‌ ఇది. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్, భూమిక‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ కుమార్‌ దర్శకుడు. పూర్ణచంద్ర తేజస్వి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్రకు సమంత సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకొన్నారు. “ఈ ఐదు రోజులు నా లైఫ్‌లో జరిగిందంతా నిజమా? అబద్ధమా?..” అంటున్నారు హీరోయిన్ సమంత.

7 15

“ఆర్కేపురం ఫ్లై ఓవర్‌ మీద జరిగిన ప్రమాదానికి సంబంధించి రికార్డులు ఉంటే ఇస్తారా?.. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి..” అని సమంత పోలీసు అధికారుల్ని అడిగారు. అధికారులు మాత్రం తిరిగి “ఎందుకు చంపావ్‌ అతడ్ని” అని ప్రశ్నించారు. “నేనేం చేయలేదు సర్‌.. నేనేం చేయలేదు సర్‌.. నేనేం చేయలేదు సర్‌..” అని సమంత ప్రశ్నించిన వారందరికీ సమాధానం చెప్పినా.. ఎవరూ నమ్మరు. ఇలా ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్‌ను రూపొందించారు. ఈ చిత్రం ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరులో విడుదలకు సిద్ధమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu