ఐటెమ్ సాంగ్ కు రెండు కోట్లు!

తెలుగు సినిమాల్లో రాను రాను ఐటెమ్ సాంగ్స్ లో నటించే అమ్మాయిలు కనిపించడం మానేశారు. దానికి కారణం మన హీరోయిన్లే. ఎందుకంటే వారే ఐటెమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి రెడీ అయిపోతున్నారు. సదరు సినిమాలో హీరో కోసమో, దర్శకుడు కోసమో నర్తించామని చెబుతున్నారు. దీనికోసం వారికి పారితోషికం కూడా ఓ రేంజ్ అందుతోంది. తాజాగా ఈ లిస్ట్ లో చేరడానికి రెడీ అవుతోంది అనుష్క. దక్షిణాది స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అనుష్క ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించడానికి సిద్ధమవుతోంది. కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. 
ఆయన సినిమాల్లో ఐటెమ్ సాంగ్ పక్కగా ఉంటుంది. అలానే మహేష్ బాబు కూడా తన సినిమాల్లో ఐటెమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం ఏకంగా అనుష్కతోనే ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికి అనుష్క ఎంత పారితోషికం తీసుకోబోతుందనే విషయం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. సాధారణంగా ఒక సినిమాలో నటించడానికి అనుష్క రెండు నుండి రెండున్నర కోట్ల వరకు చార్జ్ చేస్తుంటుంది. అయితే మహేష్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కోసం రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతుందని తెలుస్తోంది.