HomeTelugu Trending'90's. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్' వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌

’90’s. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌

90s A Middle Class Biopi

టాలీవుడ్ న‌టుడు, బిగ్‌ బాస్‌-7 ఫేం శివాజీ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న వెబ్ సిరీస్ ’90’స్. ఏ మిడిల్ క్లాస్ బ‌యోపిక్’ అనేది ఈ సిరీస్‌ క్యాప్షన్‌. ఈ సినిమాలో ‘తొలి ప్రేమ’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ శివాజీ భార్యగా నటించనుంది.

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మౌలి శివాజీ కొడుకుగా నటిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ వెబ్ సిరీస్ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్ చూస్తే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్‌ అనే ఉపాధ్యాయుడి పాత్ర‌లో శివాజీ కనిపించాడు. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఉండబోతున్నట్టు ట్రైల‌ర్ చూస్తే అర్థమవుతోంది.

ఆదిత్య హాసన్‌ డైరెక్ట్ చేస్తున్న సిరీస్‌ ని అమోఘా ఆర్ట్స్‌, ఎంఎన్‌వో ప్రొడక్షన్స్‌ బ్యానర్లపైనవీన్‌ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బలి సంగీతం అందిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ETV Win లో జనవరి 5న ప్రీమియర్ కానుంది.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu