HomeTelugu Trending'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్‌లుక్‌

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్‌లుక్‌

pawan kalyan first look fro

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీశ్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ 11 ఏళ్ల కిందట టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపింది. ఇన్నేళ్ల తర్వాత ఈ ముగ్గురి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుండి పవన్‌ కళ్యాణ్‌ లుక్‌ ని విడుదల చేసింది మూవీ యూనిట్‌.

కళ్ల జోడు పెట్టుకొని, బ్యారికేడ్ పై చేయి ఉంచిన పవన్ ఎవరికో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయింది. ఆయన వెనకాల చాలా మంది ముస్లింలు ఉన్నారు. క్లాస్, మాస్, స్వాగ్ అన్నీ కలగలిసినట్టుగా ఉన్న ఫొటో అదిరిపోయేలా ఉంది.

స్టైల్, స్వాగ్‌తో కూడిన సేవియర్ (రక్షకుడు) అంటూ చిత్ర బృందం దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చింది. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.

 

Image

ప్రభాస్ ఆదిపురుష్‌ ట్రైలర్‌

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu