HomeTelugu Trending'సాహో'లో అదే పెద్ద ట్విస్ట్‌... ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

‘సాహో’లో అదే పెద్ద ట్విస్ట్‌… ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

2 22

‘బాహుబలి’ చిత్రం తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల విడులైన సాహో ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ మూవీలో ప్రభాస్‌ పాత్రలో ఓ పెద్ద ట్విస్ట్‌ ఉండబోతుందంట. అది ఏమిటంటే ప్రభాస్‌ ఇందులో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ప్రభాస్‌ కనుక ద్విపాత్రాభియనంలో కనిపిస్తే డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు పండుగే అని చెప్పాలి.

సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తనీష్‌ బాగ్చి, జిబ్రాన్‌(నేపథ్య) సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 30న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu